×
🔥 SRIHAANFILMS PRESENTS – బతుకుదెరువు 🔥
SRIHAANFILMS
  • Home
బతుకుదెరువు Banner
🎬 Official Trailer 🎤 Pre-Release Event 🍿 Watch Movie 🎥 Making Video ⭐ Cast & Crew Opinions

Producer

SRIHAANFILMS

Director

Kulkarni Vishnukanth

Cinematographer

CHANDRASHEKAR GIDDALAMARI

ASSISTANT CAMERAMAN

SHEKOLLA PRABHAKAR

సీతగా నటిస్తున్నది

UMARANI YADAV

కిరణ్‎గా నటిస్తున్నది

K SHIVA SHANKAR

పుల్లయ్య‎గా నటిస్తున్నది

SAMEL

పోకిరిగా నటిస్తున్నది

PRABHAKAR SHEKOLLA

Language

Telugu

About Film

"బతుకుదెరువు" ఒక సామాజిక సందేశాత్మక షార్ట్ ఫిల్మ్. సాధారణ మనిషి జీవన పోరాటాన్ని, సమాజంలోని వాస్తవ పరిస్థితులను, భావోద్వేగాలతో చూపించే ప్రయత్నం. ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకేలా రూపొందించబడింది.

📰 వార్తల్లో బతుకుదెరువు

బతుకుదెరువు Banner

📰 పత్రికా ప్రకటన (ప్రెస్ నోట్)

శ్రీహాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ సగర్వంగా ప్రకటిస్తున్న నూతన చిత్రం

🎬 ‘బతుకుదెరువు’ ఘనంగా ప్రారంభం

జహీరాబాద్:

సమాజంలోని వాస్తవ పరిస్థితులను, సామాన్యుడి జీవన పోరాటాన్ని ప్రజల కళ్లకు కట్టాలనే సదుద్దేశ్యంతో శ్రీహాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్ “బతుకుదెరువు”. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జహీరాబాద్ పట్టణ పరిధిలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.

ప్రముఖ సినీ నిర్మాత శ్రీ మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ ఇచ్చి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు సంగమేశ్వర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్ర బృందానికి ఆశీర్వచనాలు అందించారు.

ఈ చిత్రానికి చంద్రశేఖర్ గిద్దలమారి నిర్మాతగా మరియు సినిమాటోగ్రాఫర్ (డీఓపీ)గా వ్యవహరిస్తుండగా, కులకర్ణి విష్ణుకాంత్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్ర నటీనటులు శంకర్, ఉమారాణి, నరేష్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. అలాగే సాంకేతిక బృందానికి చెందిన ప్రభాకర్, కాశీనాథం, జై, పోలీస్ ప్రవీణ్ పాటిల్, కే. విజయ్ కుమార్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కమర్షియల్ హంగుల కంటే కంటెంట్‌కు పెద్దపీట వేస్తూ, సామాజిక అంశాలను ప్రతిబింబించే ఈ నిజాయితీ గల ప్రయత్నాన్ని ప్రేక్షకులు, సినీ అభిమానులు మరియు మీడియా మిత్రులు ఆదరించి ఆశీర్వదించాలని చిత్ర బృందం కోరుతోంది.

— ఇట్లు,
శ్రీహాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం

📰 మీడియా మిత్రులకు ‘శ్రీహాన్ ఫిల్మ్స్’ ప్రత్యేక ధన్యవాదాలు!

🎬 బతుకుదెరువు

సినిమాకు అండగా నిలిచిన పత్రికా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు!

శ్రీహాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై, సామాన్యుడి అస్తిత్వ పోరాటాన్ని కళ్లకు కట్టేలా మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "బతుకుదెరువు" షార్ట్ ఫిల్మ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తమ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించి, మాకు ఎంతగానో అండగా నిలిచిన పత్రికా యాజమాన్యాలకు, ఎడిటర్లకు మరియు విలేకరులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

చిన్న చిత్రంగా మొదలైన మా ప్రయత్నాన్ని గుర్తించి, సమాజానికి మేం అందించాలనుకున్న సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తమవంతు సహకారం అందించిన మీడియా సంస్థలకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

📰 నమస్తే తెలంగాణ 📰 భారత్ తెలుగు 📰 స్థానికం 📰 విశాల తెలంగాణ 📰 పెన్ గన్ 📰 భారతీయ వెలుగు 📰 మెరుపు 📰 స్నేహిత ఎక్స్ ప్రెస్ 📰 తెలంగాణ వీణ

మీరు అందించిన ఈ మద్దతు, ప్రోత్సాహం మాకు మరింత బాధ్యతను, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. మంచి ఉద్దేశ్యంతో రూపొందిస్తున్న మా చిత్రానికి మీడియా మిత్రులు అందించిన సహకారాన్ని మేము ఎప్పటికీ మరిచిపోలేము.

భవిష్యత్తులో కూడా మీ సహకారం, ఆశీస్సులు మా చిత్ర బృందంపై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

కృతజ్ఞతలతో...

చంద్రశేఖర్ గిద్దలమారి
(చిత్ర నిర్మాత & సినిమాటోగ్రాఫర్)

కులకర్ణి విష్ణుకాంత్
(దర్శకుడు)

శ్రీహాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం

Contact

Email : srihaanfilms@gmail.com

Instagram : @srihaanfilms

YouTube : SrihaanFilms

SRIHAANFILMS

Cinema Beyond Imagination

© 2026 SRIHAANFILMS. All Rights Reserved.